ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో మమేకమయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో మమేకమయ్యారు. రెండు రోజుల పర్యటనలో స్థానికులు, నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కుప్పంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు సీఎం పాదాభివందనం తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా.. శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతులు చంటి బిడ్డతో వచ్చారు. తమ రెండో కుమారైకు నామకరణం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. వెంటనే ఆ పాపను చంద్రబాబు చేతులలోకి తీసుకున్నారు.
ముద్దులొలికే చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు ‘చరణి’ అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సాక్ష్యాత్తూ సీఎం పేరు పెట్టడంతో తల్లి ఆనందంతో పొంగిపోయారు. సీఎం చేత నామకరణం చేయించిన తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.