బిగ్ రిలీఫ్.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా.? తులం ఎంతంటే

బిగ్ రిలీఫ్.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా.? తులం ఎంతంటే

గోల్డ్ ప్రియులకు ఇది నిజంగానే గోల్డెన్ న్యూస్. బంగారం ధర నేల చూపులు చూస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి మారకం, అలాగే విదేశీ బంగారం నిల్వలు వెరిసి.. గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

గోల్డ్ ప్రియులకు ఇది నిజంగానే గోల్డెన్ న్యూస్. బంగారం ధర నేల చూపులు చూస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి మారకం, అలాగే విదేశీ బంగారం నిల్వలు వెరిసి.. వీటన్నింటి ప్రభావంతో గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 10 మేరకు తగ్గి రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కూడా రూ. 10 తగ్గి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందామా..

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 66,240గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 72,220గా ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ లాంటి ప్రధాన నగరాల్లో కూడా కూడా ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 66,390గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,370 దగ్గర కొనసాగుతోంది. ఆర్ధిక రాజధాని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణే నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 66,240గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 72,220గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,790గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72, 870గా ఉంది.

వెండి ధరలు ఇలా..
వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా వెండి ధరలు సుమారు రూ. 3 వేల వరకు తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే.. మరో రూ. 100 మేరకు తగ్గింది వెండి ధర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ప్రస్తుతం కిలో వెండి రూ. 95,400 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ. 90,900గా ఉంది. బెంగళూరులో అయితే కిలో వెండి ధర రూ. 90,950 దగ్గర నిలిచింది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు