ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. స్థూలకాయం గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. రాత్రి పడుకునే ముందు కొన్ని సహజమైన పానీయాలు తీసుకుంటే.. బరువు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నేటి ఉరుకు పరుగుల జీవితంలో అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తోంది.. అయితే.. ప్రమాదకర అనారోగ్య సమస్యలకు ఊబకాయం కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. స్థూలకాయం గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.. అందుకే.. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడం, పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు.. ప్రస్తుత కాలంలో చాలామంది బరువును తగ్గించుకునేందుకు జిమ్ లలో చెమటోడ్చడం, పలు రకాల డైటింగ్ లను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ.. ఫలితం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. అయితే, అలాంటి వారికి కొన్ని పానీయాలు అద్భుతంగా సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పడుకునే ముందు కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగడం వల్ల అదనపు కేలరీలు ఖర్చవుతాయి.
అంతేకాకుండా.. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి.. ఆ తర్వాత పడుకునే అరగంట ముందు ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది..అంతేకాకుండా.. మీరు బరువును వేగంగా తగ్గేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబతున్నారు.
బరువు తగ్గేందుకు ఈ పానీయాలు తీసుకోండి..
మెంతి నీరు : మెంతి గింజలు బరువు తగ్గేలా చేస్తాయి.. ముందుగా.. మెంతి గింజలను నీటిలో నానబెట్టండి. ఈ నీటిలో తేనె కలుపుకుని పడుకునే ముందు తాగాలి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మెంతి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.. ఇది ఆకలి బాధలను అరికట్టడంలో సహాయపడుతుంది. పొట్టలోని కొవ్వును కరిగిస్తుంది.
దాల్చిన చెక్క టీ: మీరు వీలైనంత త్వరగా బరువు తగ్గాలనుకుంటే దాల్చిన చెక్క టీ తాగడం ప్రారంభించండి. దాల్చిన చెక్క టీ బరువు నియంత్రణకు ఒక గొప్ప సహజ పానీయం. ఇది జీవక్రియను పెంచే లక్షణాలను కలిగి ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్స్ దీనిని డిటాక్స్ డ్రింక్‌గా మారుస్తాయి. ఇది కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది.
పసుపు పాలు: ఆహారానికి రంగు.. రుచిని జోడించడమే కాకుండా, పసుపు దాని అనేక ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. జలుబు, దగ్గు, జ్వరం లేదా గాయాన్ని తక్షణం నయం చేయడమే కాకుండా, బరువు తగ్గించడంలో కూడా పసుపు ప్రభావవంతంగా ఉంటుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి రాత్రి పడుకునే ముందు పసుపు పాలు త్రాగాలి. ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతుంది.
నిమ్మరసం – బ్లాక్ సాల్ట్: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని అందులో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే బరువు త్వరగా తగ్గుతుంది. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్ సులభంగా తొలగిపోతాయి. ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో, క్యాలరీలను బర్న్ చేయడంలో చాలా సహాయపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)