తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ
తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు.…