వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన పుత్త‌డి…

వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన పుత్త‌డి…

బిజినెస్‌

గ‌త రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు ఒక్కసారిగా మ‌ళ్లీ పెరిగాయి. పండుగ సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ‌మంది ఆస‌క్తి చూపుతుంటారు. ఈ స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డం కొంత ఇబ్బందులు తీసుకొచ్చే అంశంగా చెప్పుకోవాలి. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం ఈరోజు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 250 పెరిగి రూ.44,150కి చేరింది. 10 గ్రామ‌లు 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ. 48,160కి చేరింది. బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగిన‌ప్ప‌టికీ, వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధ‌ర రూ. 65,800 వ‌ద్ధ ఉన్న‌ది. 15 వ తేదీన ద‌స‌రా పండుగ కావ‌డంతో బంగారం ధ‌ర‌లు మ‌రికొంత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *