హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ది ఇతడే..!

హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ది ఇతడే..!

Top Story

త‌మిళ నాడు రాష్ట్రంలో నిన్న చోటు చేసుకున్న హెలి కాప్ట‌ర్ ప్ర‌మాదంలో… ఏకంగా.. 13 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌మాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మ‌ర‌ణించ‌డం విషాద‌కరం. అయితే.. ఈ ఘ‌ట‌న లో ఐఏఎఫ్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ఒక్క‌డే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు. ఆయ‌న తీవ్ర గాయాల‌తో ప్ర‌స్తుతం మిల‌ట‌రీ ఆస్ప‌త్రి లో చికిత్స పొందుతున్నారు. మృత్యువు తో పోరాడుతున్న వ‌రుణ్ సింగ్‌.. ఈ ఏడాదే శౌర్య చ‌క్ర అవార్డు అందుకున్నారు.

Loading...

గ‌తేడాది ఎల్ ఏసీ తేజ‌స్ ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఎమ‌ర్జ‌న్సీ సేవ్ కూడా చేశాడు. . ఇది ఇలా ఉండ‌గా… శుక్రవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేప‌థ్యంలోనే… రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలను త‌ర‌లించ‌నున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.