ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు.. ఇవి చేస్తే చాలు-మంత్రి హరీష్‌రావు

ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు.. ఇవి చేస్తే చాలు-మంత్రి హరీష్‌రావు

తెలంగాణ

ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవడం ప్రజలు చేతుల్లో ఉందని తెలిపిన మంత్రి.. వ్యాక్సిన్‌ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, భౌతికదూరం పాటించాలని సూచించారు.

Loading...

ఇక, ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్‌ వేసుకోవాడనికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు.. అంతా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు.. రాష్ట్రంలో 2 కోట్ల 51 లక్షల మంది మాత్రమే మొదటి టీకా వేసుకున్నారని.. రెండు డోసులు వేసుకోండి.. ప్రాణాపాయం ఉండదన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల వాక్సిన్ స్టాక్ ఉందని తెలిపిన ఆయన.. లోకల్ కార్పొరేటర్ ఎన్నికల సమయంలో ఎలా ఓటు కోసం వెళ్లారో… ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్‌ వేయించాలని ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు, కర్ణాటకలో వచ్చిందని కేంద్ర వైద్య అధికారులు ప్రకటించారన్న ఆయన.. విదేశాల నుంచి దేశంలోకి వచ్చేవారికి ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్‌లు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఆమె శాంపిల్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపించాము, రిపోర్ట్ రావడం కోసం 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందన్నారు మంత్రి హరీష్‌రావు.

Loading...

Leave a Reply

Your email address will not be published.