‘బాహుబలి 3’ ని ప్రకటించిన రాజమౌళి

‘బాహుబలి 3’ ని ప్రకటించిన రాజమౌళి

సినిమా వార్తలు

తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి.. ప్రపంచమంతా రికార్డులు సృష్టించి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సత్తా చెడిన దర్శకుడు రాజమౌళి.. బాహుబలి 1,2 పార్ట్ లు విజువల్ గా అద్భుత కళాఖండాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ఇక ఈ సినిమాల తరువాత జక్కన్న మరో అద్భుతం ఆర్ఆర్ఆర్.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి.. భవిష్యత్తులో బాహుబలి 3 ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు యెగిరి గంతేస్తున్నారు.

Loading...

తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో పాల్గొన్న జక్కన్న మాట్లాడుతూ ” బాహుబలి 3 తీయడానికి స్కోప్ ఉంది.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో బాహుబలి 3 తీస్తాను. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను.. ఇంతకన్నా ఎక్కువ చెప్తే ఫోకస్ అంతా అటే వెళ్తోంది. అందుకే ఇప్పుడే ఎలాంటి విషయాన్ని నేను చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్లారిటీతో బాహుబలి 3 త్వరలోనే ఉండబోతోందనే విషయం అర్ధమయ్యింది. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమా తరువాత బాహుబలి 3 ఉండబోతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాహుబలి 1,2 పార్ట్ లతోనే చరిత్ర సృష్టించిన జక్కన్న బాహుబలి 3 తో చరిత్ర తిరగరాస్తాడేమో చూడాలి.

Loading...

Leave a Reply

Your email address will not be published.