‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్

‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్

సినిమా వార్తలు

చాలా కాలం తరువాత ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద అతి పెద్ద ఫైట్ జరగబోతోంది. రాజమౌళి “ఆర్ఆర్ఆర్”, ప్రభాస్ “రాధే శ్యామ్” రెండూ పాన్ ఇండియా చిత్రాలూ ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. హిందీలో “ఆర్ఆర్ఆర్” కోసం రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం జనవరి 6 నుండి ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. దీంతో అప్పటి వరకూ హిందీలో “ఆర్ఆర్ఆర్”కు గట్టి పోటీ ఉండబోతోందని భావించగా అది కాస్తా క్లియర్ అయ్యింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’కు ఇప్పుడు ప్రభాస్‌కు కొత్త సమస్యగా మారబోతున్నాడు.

హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు విపరీతంగా క్రేజ్ ఉంది. నార్త్‌లో ‘సాహో’ విజయం సాధించడం దానికి నిదర్శనం. ఇక ఇప్పుడు హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘రాధే శ్యామ్’ కోసం రికార్డు స్థాయిలో స్క్రీన్స్ బుక్ చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఉత్తరాన ఇప్పటి వరకు ‘రాధేశ్యామ్’ కోసం 3700 స్క్రీన్లు బుక్ అయ్యాయి. కరోనా మహమ్మారి తర్వాత ఇన్ని స్క్రీన్‌లను కేటాయించడం విశేషం. ఒక దక్షిణాది స్టార్ సినిమా కోసం ఉత్తరాదిన ఇన్ని థియేటర్లు బుక్ అవ్వడం రికార్డు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడే వచ్చింది చిక్కు.

Loading...

‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమైంది. ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు మధ్య ఒక వారం గ్యాప్ ఉంటుంది. ఆ తరువాత సినిమా బాగుంటే అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లకు ఢోకా ఉండదు. కానీ సినిమా గురించి టాక్ కాస్త అటూ ఇటూ వచ్చిందంటే ‘రాధేశ్యామ్’ అమాంతం ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లను లాగేసుకోవడం ఖాయం. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ నార్త్ లో చాలా వరకు థియేటర్లు బుక్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సినిమా విడుదల తరువాత “ఆర్ఆర్ఆర్” అక్కడ నిలదొక్కుకోవడం కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ రాజమౌళిని తక్కవగా అంచనా వేయడానికి వీలులేదు. ఆయన వ్యూహాత్మక ప్రణాళిక ఎప్పటికి ప్రత్యేకమైనది. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే “ఆర్‌ఆర్‌ఆర్‌” ప్రమోషన్స్ కోసం కోట్లాది డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోంది టీం. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ మధ్య నార్త్ లో స్క్రీన్స్ విషయమై టఫ్ ఫైట్ జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Loading...

Leave a Reply

Your email address will not be published.