మెగా ఫ్యామిలీలో ఆ జంట విడాకులు..?

మెగా ఫ్యామిలీలో ఆ జంట విడాకులు..?

సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ లో ఒక జంట విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఆ విభేదాలు విడాకుల వరకు వెళ్లినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. మెగా ఫ్యామిలీ ప్రతి ఫొటోలోని కళ్యాణ్ దేవ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇటీవల మెగా ఫ్యామిలీ దీపావళీ సంబరాల్లో ఆయన మిస్ అయ్యాడు. అంతే కాకుండా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో పాటు మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫొటోలోనూ కళ్యాణ్ దేవ్ మిస్ అయ్యాడు. దీంతో అక్కినేని వారింట జరిగినట్టే మెగా ఫ్యామిలోను ఆ జంట విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్.

ఇటీవల తన భార్య శ్రీజ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన కళ్యాణ్ దేవ్ ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ” హ్యాపీ బర్త్ డే స్వీటూ” అంటూ శ్రీజను ట్యాగ్ చేశాడు. ఇక ఈ ఒక్క ఫోటోతో రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టినట్లు అయ్యిందని నెటిజన్లు అంటున్నారు. ఐదేళ్ల క్రితం శ్రీజను వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.. వీరికి నవిష్క అనే పాప ఉంది. ఇకపోతే ప్రస్తుతం కళ్యాణ్ దేవా పలు తెలుగు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమాలు విడుదల కానున్నాయి.

Loading...

https://www.instagram.com/p/CWD_RLsBhMi/

Loading...

Leave a Reply

Your email address will not be published.