సింహాద్రి అప్పన్న దర్శనంలో బాలయ్య

సింహాద్రి అప్పన్న దర్శనంలో బాలయ్య

సినిమా వార్తలు

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ” విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ‘అఖండ’ టీం అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ అండ్ టీం పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “అఖండ” సినిమా ‘అఖండ’ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. ఈ ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం మాత్రమే కాదు… చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాతో చలన చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Loading...

కాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు వైజాగ్ లోని ఎంజిఎం గ్రౌండ్స్, యుడా పార్క్ లో ‘అఖండ’ విజయోత్సవానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం అక్కడికి చేరుకుంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.