బన్నీ ఇంటి దగ్గర భారీగా జనసందోహం

బన్నీ ఇంటి దగ్గర భారీగా జనసందోహం

సినిమా వార్తలు

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు తన 38వ పుట్టినరోజు వేడుకలను కుటుంబంతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. అయితే గురువారం హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద ఆయన అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. దాదాపు అర్ధరాత్రి నుంచే బన్నీ ఫ్యాన్స్ ఆయన ఇంటి దగ్గర చేరినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు డైరెక్టుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఏపీ, తెలంగాణ నుంచి అభిమానులు ఆయన ఇంటి దగ్గరకు చేరుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా అభిమానులను కలుసుకోవడానికి బన్నీ తన ఇంటి గోడకు ఉన్న ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ను ఆఫ్ చేయించారు. ఇంటి బయట ఉన్న అభిమానులకు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ లోపల నుంచే కరోనా జాగ్రత్తలు చెబుతూ చెట్లు, మాస్కులు ఇచ్చారు. కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు బన్నీ.

Loading...

మరోవైపు అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘పుష్ప’ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆగష్టు 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.