ప‌వ‌ర్ వాక్‌: న‌డ‌క‌తో క‌రెంట్ ఉత్ప‌త్తి… ఎలాగంటే..

ప‌వ‌ర్ వాక్‌: న‌డ‌క‌తో క‌రెంట్ ఉత్ప‌త్తి… ఎలాగంటే..

లైఫ్ స్టైల్

న‌డ‌క ఆరోగ్యానికి చాలా మంచిది. ప్ర‌తిరోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల‌న శ‌రీరంలోని అన‌వ‌స‌రంగా ఉన్న కొవ్వు క‌రుగుతుంది. ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. న‌డ‌క గుండే ఆరోగ్యానికి మంచిది. డ‌యాబెటిస్ ఉన్న వ్య‌క్తులు త‌ప్ప‌నిసరిగా కాసేపు వాకింగ్ చేయాలి. న‌డ‌క ఆరోగ్యాన్నివ్వ‌డ‌మే కాకుండా ఇంటికి వెలుగులు కూడా ఇస్తుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. న‌డుస్తూనే క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. చెక్క ఫ్లోరింగ్‌పైన స్పెష‌ల్ సినికాన్‌కు కోటింగ్ చేయ‌డం వ‌ల‌న క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు. సిలికాన్ కోటింగ్ చేసిన చెక్క‌ఫ్లోర్‌పై అడుగువేయ‌గానే చెక్క‌ఫ్లోర్‌పై ఒత్తిడి ఏర్ప‌డుతుంది. ఎలక్ట్రాన్ల ప్ర‌వాహం జ‌రుగుతుంది. ఫ‌లితంగా క‌రెంట్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇలా ఉత్ప‌త్తి అయిన క‌రెంట్‌తో బ‌ల్బులు, చిన్న చిన్న ఎల‌క్ట్రానిక్ డివైజ్‌లకు వినియోగించుకోవ‌చ్చు. ట్రైబోఎల‌క్ట్రిక్ ప‌ద్ద‌తి ద్వారా క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేస్తారు. మ‌నిషికి హాని జ‌ర‌గ‌ని విధంగా త‌క్కువ స్థాయిలో ప‌వ‌ర్ ఉత్ప‌త్తి ఉంటుంద‌ని స్విట్జ‌ర్లాండ్ కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప‌వ‌ర్ వాక్ ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు జూరిచ్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published.