48 ఏళ్లుగా ఆ వ్యక్తి నిద్రపోవడం లేదట‌…

48 ఏళ్లుగా ఆ వ్యక్తి నిద్రపోవడం లేదట‌…

లైఫ్ స్టైల్

ఒక‌టి లేక రెండో రోజులు నిద్ర‌పోలేదు అంటేనే క‌ళ్లు ఎర్రగా మారి అనేక ఇబ్బందులు ప‌డతాం. ఏ ప‌ని చేయ‌లేము. అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అయితే, ఓ వ్య‌క్తి గ‌త 48 ఏళ్లుగా నిద్ర‌కు దూరంగా ఉంటున్నాడ‌ట‌. అయ‌నే కాదు, అయన తండ్రి, తాత కూడా ఇలానే నిద్ర‌పోకుండా ఉండేవార‌ట‌. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రేవాకు చెందిన మోహ‌న్‌లాల్ చిన్న త‌నం నుంచి చాలా త‌క్కువ‌గా నిద్ర‌పోయేవాడు. 1973 లో గ్రూప్ ప‌రీక్ష‌లు రాసి త‌హ‌సీల్దార్ గా ఉద్యోగం వ‌చ్చిన త‌రువాత అసలు ఒక్క క్ష‌ణం కూడా నిద్ర‌పోలేద‌ని చెబుతున్నారు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు. ఏమైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయేమో అని వైద్యుల‌కు చూపించినా ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు చెప్ప‌డం విశేషం. ఎంత ప్ర‌య‌త్నించినా క్ష‌ణం కూడా నిద్ర రాద‌ని ఆయ‌న చెబుతున్నారు. గ‌త 48 ఏళ్లుగా ఇలానే నిద్ర‌పోకుండా ఉంటున్నార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published.