మాస్కు లేని వారిని దుకాణాలకు అనుమతిస్తే 25 వేలు జరిమానా…

మాస్కు లేని వారిని దుకాణాలకు అనుమతిస్తే 25 వేలు జరిమానా…

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ. 100 జరిమాన విధింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల మేర జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.

Loading...

ఇక ఉల్లంఘనలు జరిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసేసేలా చర్యలు తీసుకుంటుంది. అలాగే దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో జరిగే ఉల్లంఘనలను 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా తెలియచేయలని సూచించింది ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు వెల్లడించింది. ఇక జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఈ అంశాలను పర్యవేక్షించాలని సూచించింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.