మిస్టర్ బీన్ ఇక లేరు… ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఘనకార్యం

మిస్టర్ బీన్ ఇక లేరు… ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఘనకార్యం

Top Story

హాలీవుడ్ ప్రముఖ బ్రిటిష్ నటుడు రోవాన్ అట్కిన్సన్ ఇక లేరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మిస్టర్ బీన్’గా ప్రపంచానికి బాగా దగ్గరైన ఆయన చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రసారం చేయడం గమనార్హం. ఈ వార్త చూసిన ఆయన అభిమానులు తమ అభిమాన నటుడిని కోల్పోయినందుకు కలత చెందారు. రోవాన్ అట్కిన్సన్ చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది RIP మిస్టర్ బీన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. మరికొంత మంది విచారం వ్యక్తం చేశారు. కానీ ఇది పూర్తిగా ఫేక్ న్యూస్.

రోవాన్ అట్కిన్సన్ మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను యూఎస్ బ్రాడ్‌కాస్టర్ ఫాక్స్ న్యూస్ షేర్ చేసింది. ఫాక్స్ న్యూస్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ‘ఫాక్స్ బ్రేకింగ్ న్యూస్ – మిస్టర్ బీన్ (రోవాన్ అట్కిన్సన్) 58 సంవత్సరాల వయస్సులో కారు ప్రమాదంలో మరణించారు’ అంటూ లింక్‌పై క్లిక్ చేయండి అని పోస్ట్ చేశారు. కానీ ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని తెలియడంతో అంతర్జాతీయంగా ఉన్న రోవిన్ అభిమానులు సదరు న్యూస్ ఛానల్ పై మండి పడుతున్నారు. బాధ్యత గల స్థానంలో ఉండి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Loading...

అయితే రోవాన్ అట్కిన్సన్ మరణించినట్లు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. రోవాన్ అట్కిన్సన్ అకా మిస్టర్ బీన్ 18 మార్చి 2017 న రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఇంతకు ముందు కూడా వార్తలు రాగా ఆయన బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం రోవాన్ మరణ వార్త రావడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రోవిన్ అట్కిన్సన్ ప్రముఖ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్‌’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు.

ఆయన పోషించిన ‘మిస్టర్ బీన్’ పాత్ర మొదటిసారి 1990లో కనిపించింది. దీని తరువాత క్రమంగా ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీంతో రోవాన్ అట్కిన్సన్ ను అందరూ మిస్టర్ బీన్ అని పిలవడం విశేషం. మిస్టర్ బీన్ ఫేస్‌బుక్ పేజీ ప్రపంచంలో అత్యధికంగా లైక్ చేయబడిన పేజీలలో 10వ స్థానంలో ఉందంటే మిస్టర్ బీన్ పాత్రకు ఉన్న ప్రజాదరణ ఎంత అనేది అంచనా వేయవచ్చు.

Loading...

Leave a Reply

Your email address will not be published.