షాకింగ్‌ : అఘోరీని పెళ్లాడిన అఘోరా..

షాకింగ్‌ : అఘోరీని పెళ్లాడిన అఘోరా..

Top Story

మామూలుగా అఘోరా అంటేనే ఆశ్చర్యం, ఒక్కింత భయం కలగడం సహజం. దానికి కారణం అఘోరాల విధివిధానాలే. అఘోరాల్లో కొందరు నగ్నంగా, చిన్న గుడ్డకట్టుకొని కనిపించడమే కాకుండా వారి రూపం కూడా భయాందోళనకు గురి చేస్తుంటుంది. అంతేకాకుండా ఈ అఘోరాలు కాలిన బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవడం, మానవ మృతదేహాలను తినడం లాంటి విపరీత చర్యలు చూసి ఒక్కింత భయం కలుగుతుంది. అయితే తాజాగా ఓ అఘోరా తన శిష్యురాలిగా ఉన్న అఘోరీని పెళ్లి చేసుకున్నాడు.

తమిళనాడుకు చెందిన మణికందన్‌ అనే వ్యక్తి కాశీలో అఘోర ఉపాసన చేసి అఘోరాగా మారాడు. అనంతరం తన స్వగ్రామానికి వచ్చి జై అఘోర కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అఘోర ఉపాసనపై ఇష్టం ఉన్న వారిని ఉపాసన చేస్తూ తన శిష్యులుగా చేర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కలకత్తాకు చెందిన ప్రియాంక అనే మహిళ అఘోరీగా మణికందన్‌ వద్ద మహిళా అఘోరీలకు ఉపాసన చేస్తుంటుంది. అయితే ఈ నెల 22న ఉదయం అఘోరా మణికందన్‌, అఘోరీ ప్రియాంకను హిందూ సంప్రదాయం ప్రకారం తాలికట్టి వివాహం చేసుకున్నాడు.

Loading...

అయితే వివాహానికి ముందు తరువాత యజ్ఞాలు చేశారు. అఘోరా మణికందన్‌ వివాహ వేడుకల తోటి అఘోరాలు, అఘోరీలు నాట్యం చేస్తూ, శంకం, డమరుకం వాయించారు. గతంలో తన తల్లి చనిపోయినప్పుడు తల్లి శవంపై కూర్చోని అఘోరా సంప్రదాయం ప్రకారం పూజుల నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించి వార్తలు నిలిచాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.