రాష్ట్రంలో 15 రోజుల్లో కోటి టీకాలు…

రాష్ట్రంలో 15 రోజుల్లో కోటి టీకాలు…

తెలంగాణ

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్క‌టే ప్ర‌స్తుతానికి ఉన్న ఏకైక మార్గం కావ‌డంతో దేశంలో ప్ర‌తిరోజూ ల‌క్ష‌ల సంఖ్య‌లో వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా సాగుతున్న‌ది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్పెష‌ల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. మొబైల్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఈ మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. రాబోయే 15 రోజుల వ్య‌వ‌ధిలో మ‌రో కోటి మందికి వ్యాక్సిన్ అందించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. దీనికి త‌గ్గ‌ట్టుగా ఈరోజు నుంచి రాష్ట్రంలో స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ సిద్ధం అయింది. రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published.