కరోనా థర్డ్‌వేవ్‌ పై హెచ్చరికలు !

కరోనా థర్డ్‌వేవ్‌ పై హెచ్చరికలు !

తెలంగాణ

తెలంగాణలో జనం మళ్లీ మాస్కులు పడేసి గుంపులు గుంపులు తిరుగుతున్నారు.అయితే కరోనా మాత్రం ఇంకా పోలేదంటున్నారు నిపుణులు. లాక్‌డౌన్‌ సమయంలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో.. ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలంటున్నారు. ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్‌తో కరోనా అంతం కాలేదని… థర్డ్‌వేవ్‌ కూడా పొంచి ఉందటున్నారు వైద్యులు. లాక్ డౌన్ సమయానికంటే ఆతర్వాతే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని లేదంటే… మళ్లీ కరోనా ఎటాక్‌ అవుతుందని హెచ్చరిస్తున్నారు.

Loading...

అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి – ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు . అందుకే ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.. రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *