తెలంగాణ‌లో బొగ్గుగ‌నుల‌పై కేంద్రం దృష్టి… ఇత‌ర ప్రాంతాల‌కు పంపాల‌ని ఆదేశం…

తెలంగాణ‌లో బొగ్గుగ‌నుల‌పై కేంద్రం దృష్టి… ఇత‌ర ప్రాంతాల‌కు పంపాల‌ని ఆదేశం…

జాతీయం

దేశంలో బొగ్గునిల్వ‌ల స‌మ‌స్య ఏర్ప‌డింది. విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వ‌లు త‌గ్గిపోవ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌కు అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అదే జ‌రిగితే విద్యుత్ సంక్షోభం ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని రాష్ట్రాలు ఆందోళ‌న చెందుతున్నాయి. దీనిపై నిన్న‌టి రోజుక కేంద్రం ప్ర‌ధాని నేతృత్వంలో స‌మీక్ష‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం దేశంలోని బొగ్గు నిల్వ‌ల‌పై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణ‌లో బొగ్గు నిల్వ‌ల‌పై కేంద్రం దృష్టి పెట్టింది. దేశంలో మొత్తం 116 విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు ఉన్నాయి. వీటికి బొగ్గుగ‌నులు ఎంత ఉన్నాయి. ఎంతెంత బొగ్గు అవ‌స‌రం అనే విష‌యాల‌పై కేంద్రం దృష్టి పెట్టింది. 116 లో కేవ‌లం 4 చోట్ల మాత్ర‌మే 13 రోజుల‌పాటు క‌రెంట్ ఉత్ప‌త్తికి కావాల్సిన బొగ్గునిల్వ‌లు ఉన్నాయ‌ని కేంద్రం గుర్తించింది. తెలంగాణ‌లోని భూపాల‌ప‌ల్లి విద్యుత్ కేంద్రంలో 15 రోజ‌ల విద్యుత్ ఉత్ప‌త్తికి స‌రిప‌డా బొగ్గునిల్వ‌లు ఉన్నా, ఇంకా అద‌నంగా అక్క‌డికి ఎందుకు పంపుతున్నార‌ని సింగ‌రేణిని కేంద్రం ప్ర‌శ్నించింది. బొగ్గు కొర‌త తీవ్రంగా ఎదుర్కొంటున్న ఏపీ, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గును స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించింది.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *