సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం ఏంటి ?

సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం ఏంటి ?

సినిమా వార్తలు

గత కొన్ని రోజులుగా అక్కినేని కోడలు సమంత, నాగచైతన్య మధ్య మనస్పర్ధలు, త్వరలోనే విడిపోతున్నారంటూ ప్రచారం అవుతోంది. ఈ రూమర్స్ కు అటు అక్కినేని ఫ్యామిలీ గాని, ఇటు సమంత గానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇటీవల కాలంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ విషయంపై స్పందించడానికి ఏమాత్రం సిద్ధంగా లేనని, తనకు నచ్చినప్పుడే చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతానని తేల్చి చెప్పేసింది. ఈ విషయంపై టాలీవుడ్ లో ఇప్పుడు చర్చ నడుస్తోంది.

గతంలో తాను “ది ఫ్యామిలీ మ్యాన్-2” వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో నటించినప్పుడు కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయని, ఆ సమయంలో కూడా తను సైలెంట్ గానే ఉన్నానని ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అని చెప్పడం, ఈ రెండింటినీ లింక్ చేయడం వెనక అర్థం ఏంటో ఆమె అభిమానులకు ఏమాత్రం అర్థం కాలేదు.

ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆమె విష్ చేస్తూ చేసిన ట్వీట్ పై అందరి దృష్టి పడింది. ఆమె ప్రేమగా “మామా” అంటూ ట్వీట్ చేయడం, నాగ్ పట్ల తన గౌరవాన్ని వ్యక్తపరచడంతో అక్కినేని అభిమానులు అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆరోజు జరిగిన నాగార్జున పుట్టిన రోజు వేడుకల్లో కుటుంబం మొత్తం పాల్గొన్నా సమంత మాత్రం కనిపించలేదు. ఆమె విజయ్ సేతుపతితో నటిస్తున్న తమిళ చిత్రం షూటింగ్ సినిమా కోసం చెన్నైలో ఉంది. కానీ అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి, షూటింగ్ కు తిరిగి హాజరు కావడానికి పెద్ద విషయం కాదు. అయినప్పటికీ సామ్ మాత్రం ఈ పార్టీకి గైర్హాజరు అయ్యింది. దీంతో మరోసారి చైతన్య, సమంత విడాకుల విషయం హాట్ టాపిక్ అయింది.

Loading...

ఇదిలా ఉంటే కోడలు చెప్పిన విషెస్ కి నాగార్జున ఏమాత్రం రియాక్ట్ కాకపోవడం సరికొత్త అనుమానాలకు తెర తీస్తోంది. కాజల్ అగర్వాల్, రమ్యకృష్ణ, అల్లరి నరేష్, రామ్ చరణ్, రవితేజ, వెంకటేష్, చిరంజీవి, మహేష్ బాబు లతో పాటు నాగచైతన్యకు కూడా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విష్ చేసినందుకు రిప్లై ఇచ్చాడు.

అక్కినేని అమల, అఖిల్, సమంత ట్వీట్స్ కు మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అమల, అఖిల్ సరే… ప్రస్తుతం సమంత విషయంలో ఇలాంటి రూమర్స్ చక్కర్లు కొడుతున్న తరుణంలో నాగార్జున ఆమె విషెస్ కు స్పందించకపోవడం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సామ్ విషయంలో నాగ్ మౌనానికి కారణం ఏంటో? అని ఆలోచిస్తున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.