“వరుడు కావలెను” వేడుకకు గెస్ట్ గా బన్నీనే ఎందుకు ?

“వరుడు కావలెను” వేడుకకు గెస్ట్ గా బన్నీనే ఎందుకు ?

సినిమా వార్తలు

ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ విచ్చేశారు. అయితే అల్లు అర్జున్ నే ఎందుకు గెస్ట్ గా పిలిచారు ? అనే డౌట్ ఎవరికన్నా వచ్చిందా?… ఆ డౌట్ వచ్చిన వాళ్ళ కోసం సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్. “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన త్రివిక్రమ్ ఈ వేడుకకు బన్నీనే ఎందుకు గెస్ట్ గా వచ్చాడు అనే విషయాన్ని వేదికపై వెల్లడించారు.

Loading...

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ “హారిక అండ్ హాసిని స్టార్ అయ్యిందే అల్లు అర్జున్ చేసిన ‘జులాయి’తో. ఇది ఆయనకు హోమ్ బ్యానర్ లాంటిది కాబట్టి చిత్రబృందాన్ని అభినందించడానికి అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చేశాడు. ఆయనకు థ్యాంక్స్. ఇక చిత్రబృందానికి పేరుపేరునా శుభాభినందనలు. మనకు తెలిసిన ఒక ఆడపిల్ల కథ ఇది. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ కథను ఎంచుకుని సగం బ్యాటిల్ ను గెలిచింది. ఆ తరువాత సరైన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకోవడంతో మిగతా సగం విన్ అయ్యింది ” అంటూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు త్రివిక్రమ్.

Loading...

Leave a Reply

Your email address will not be published.