సమంత స్టైలిస్ట్ కు బెదిరింపులు

సమంత స్టైలిస్ట్ కు బెదిరింపులు

సినిమా వార్తలు

సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై ఇంకా చర్చ నడుస్తుంటే ఉంది. వారి విడాకుల విషయంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆమె తన స్టైలిస్ట్ తో రిలేషన్ లో ఉంది అని. అయితే ఈ వార్తలపై తాజాగా సామ్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ స్పందించారు. ‘మహిళలపై హింస’ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రీతం చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో నాగ చైతన్యకు సామ్‌తో ప్రీతం స్నేహం నచ్చలేదని చెబుతున్నారు. అక్కినేని దంపతుల మధ్య విభేదాలకు కారణం ప్రీతం, అతన్ని చంపేస్తామని బెదిరించే స్థాయికి ట్రోల్స్ వెళ్లాయి.

Loading...

తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ప్రీతం జుకాల్కర్ మాట్లాడుతూ “నేను సమంతను ‘జిజి’ అని పిలుస్తానని చైకి తెలుసు. అంటే సోదరి అని అర్ధం. మా మధ్య లింక్ ఎలా ఉంటుంది? నేను ఆమెకు ‘ఐ లవ్ యు’ అని ఎలా చెప్పగలను. నేను ఒక సోదరి లేదా స్నేహితుడిపై ప్రేమను వ్యక్తం చేయకూడదా ? ఒక మహిళ ఇప్పటికే బాధపడుతున్నప్పుడు ప్రజలు ఇలాంటి పుకార్లను ఎలా వ్యాప్తి చేస్తారు ? ఇది చాలా దారుణం. సమంత, నాపై ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా” అంటూ తామిద్దరినీ కలిపి చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించారు. ఇక తనకు ప్రాణహాని ఉందని, సోషల్ మీడియాలో తనకు తెలియని అపరిచితుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *