షాకింగ్: ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ విడాకులు..?

షాకింగ్: ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ విడాకులు..?

సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీలు ఎప్పుడు , ఎవరి ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు.. ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారే అతి కొద్దీ ఏళ్లలోనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ న్యూస్ వేడి ఇంకా తగ్గలేదు.. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈసారి బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా వంతు అన్నట్లు ఉంది… బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక.. అమెరికా సింగర్ నిక్ జోనస్ తో రెండు నెలల ప్రేమాయణాన్ని మూడు ముళ్ళతో వివాహ బంధంగా మార్చుకుంది.

Loading...

2018 లో ఒక్కటైన వీరు ఎక్కడ చూసిన స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు. వీరి అన్యోన్య దాంపత్యం చూసి అటు అమెరికా, ఇటు ఇండియా తెగ మురిసిపోయింది. అయితే తాజా పరిణామాలు చుస్తే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.. మరికొంతమంది వీరిద్దరికి విడాకులు కూడా అయిపోయాయని చెప్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. పెళ్లి అయ్యాక ప్రియాంక భర్త పేరు జోనస్ ని తన ఇన్స్టాగ్రామ్ ఐడీలో యాడ్ చేసింది. మొన్నటివరకు ప్రియాంక చోప్రా జోనస్ గా ఉన్న ఆమె ఐడీ.. నిన్న జోనస్ పేరును తొలగించి ప్రియాంక చోప్రాగా మార్చేసింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తలకు ఆజ్యం పోసింది. ఇటీవల సమంత కూడా విడాకుల ముందు అత్తగారింటి పేరు అక్కినేనిని తొలగించిన విషయం తెల్సిందే.. ప్రస్తుతం ప్రియన్క కూడా అదే పని చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ప్రియాంక, నిక్ నోరు తెరవాల్సిందే..

Loading...

Leave a Reply

Your email address will not be published.