అక్కినేని యువహీరోలకు అచ్చి వచ్చిన గీతాఆర్ట్స్

అక్కినేని యువహీరోలకు అచ్చి వచ్చిన గీతాఆర్ట్స్

సినిమా వార్తలు

నాగార్జున త‌న‌య‌లు నాగచైతన్య, అఖిల్ ఈ ఏడాది వరుస హిట్స్ అందుకున్నారు. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’తో పాటు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ రెండూ విజయవంతం కావటంతో నాగ్ ఆనందానికి హద్దే లేదు. ఓ వైపు తను హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్5’ కూడా మెల్ల మెల్లగా ప్రజాదరణ పొందటం, తనయులు ఇద్దరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ కావటం ఆయన ఆనందానికి కారణాలు. ఇక గతంలో నాగచైతన్య కు ‘100 పర్సంట్ లవ్’తో హిట్ ఇచ్చింది గీతా ఆర్ట్స్ సంస్థనే.

Loading...

ఇప్పుడు అఖిల్ కి తొలి విజయం అందించింది కూడా ఆ సంస్థనే కావటం విశేషం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించిన సినిమాగా నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ నిలిస్తే… ఇప్పుడు విడుదలైన మూడు రోజుల్లోనే చక్కటి వసూళ్ళను సాధించి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచింది. ఇలా అన్నదమ్ములిద్దరికీ కెరీర్ లో చక్కటి విజయాలను అందించిన సంస్థగా గీతా ఆర్ట్స్ నిలిచింది. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా జరపటానికి గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం విశేషం.

Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *