సమ్మర్​లో ఇల్లు చల్లగా ఉండాలంటే ఇలా చేస్తే బెటర్

సమ్మర్​లో ఇల్లు చల్లగా ఉండాలంటే ఇలా చేస్తే బెటర్

లైఫ్ స్టైల్

ఎండాకాలం రాగానే టాప్​ఫ్లోర్స్​లో ఉండేవాళ్లు ఎండలు మరీ పెరగకముందే జాగ్రత్త పడాలి. కూల్ సిమెంట్​ను ఇంటి పైకప్పుకి వేయిస్తే ఇంటి గోడలకు వేడి దిగదు. కూల్​ సిమెంట్​ తెల్లగా ఉండడం వల్ల ఎక్కువ వేడిని గ్రహించుకోదు.
ఇంటి మీద మొక్కలను పెంచితే ఇంట్లో వేడి తగ్గించొచ్చు.
క్రాస్ వెంటిలేషన్ కోసం కిటికీలు తెరిచి ఉంచాలి. కిటికీలు తెరవడం వరకు ‘ఓకే’ కానీ పొల్యూషన్​ సంగతో అంటున్నారా?. అందుకే కిటికీలను తెరిచేందుకు టైమింగ్స్​ ఉన్నాయి. వాటిని ఉదయం, రాత్రిళ్లు తెరిస్తే చల్లటి గాలి ఇంటి లోపలికి వస్తుంది.
ముదురు రంగులు వేడిని పీల్చుకుంటాయి. అందుకని లేతరంగు కర్టెన్లను వేయాలి. అలాగే కిటికీలకు వెదురు బ్లైండ్స్ లేదా లైట్ బ్లాకింగ్ మెటీరియల్‌‌‌‌ లేత రంగు కర్టెన్లను వాడాలి. లేదా రెగ్యులర్​గా వాడే కర్టెన్ల వెనుక లైనింగ్​ ఫ్యాబ్రిక్​ను వాడినా గదులు చల్లగా ఉంటాయి.


పడమర, దక్షిణ దిశల్లో ఉండే కిటికీల వల్ల గదులు బాగా వేడెక్కుతాయి. అందుకని, కార్లకు వాడినట్టు విండోస్​ ఫిల్మ్స్​ని ఇంట్లో కిటికీలకు కూడా వాడొచ్చు. ఇవి ఇంట్లో వేడి పెరగకుండా చేస్తాయి.

Loading...


ఇంటి మీదే కాకుండా ఇంట్లో కూడా ఇండోర్ మొక్కలు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. కలబంద, పామ్​, మనీ ట్రీ, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కలు గాలి నుండి హానికరమైన పదార్థాలని తీసేసి, చుట్టుపక్కల వేడిని తగ్గిస్తాయి.
బెడ్స్​, సోఫాల మీద మెత్తటి కాటన్​ క్లోత్స్​ను వేయాలి. వేసవి కాలంలో. పాత స్టైల్, కాటన్ పరుపులు వాడటం మంచిది.

Loading...

Leave a Reply

Your email address will not be published.