తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్ !

తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్ !

ఆంధ్రప్రదేశ్

తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నేడు మరో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు పోలీసులు.. ఇదే కేసులో అరెస్ట్ అయిన
ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అటు ఈ కేసులో ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీ కి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో ఈ రోజు నుంచి 4 రోజుల కస్టడీ లోకి తీసుకోనున్నారు పోలీసులు. మస్తాన్ వలీని 4 వ రోజు కస్టడీలో తీసుకొని ప్రశ్నించనున్న పోలీసులు… మరికొంత మంది నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *