నేటి నుంచి అమల్లోకి కేంద్రం విడుదల చేసిన గెజిట్‌

నేటి నుంచి అమల్లోకి కేంద్రం విడుదల చేసిన గెజిట్‌

ఆంధ్రప్రదేశ్

కృష్ణా,గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశముందని కేఆర్ఎంబి బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉండటంతో ప్రస్తుతానికి వీలు కాదని తెలిపింది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది.

గెజిట్ లోని పలు అంశాలపై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు తెలిపింది. తమకు ఇంకా నీటి కేటాయింపులు జరగనందున గెజిట్ నోటిఫికేషన్ అమలు కొన్నాళ్లు పాటు వాయిదా వేయాలని గడిచిన సారి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. మొన్నటి సమావేశంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి రాకుంటే ప్రయోజనం ఏంటన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏపీ అధికారులు. సాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలినందువల్లే వివాదం తలెత్తిందని..దీంతో గెజిట్ వచ్చిందని వాదిస్తోంది ఏపీ.

Loading...

అయితే అన్నింటినీ తీసుకోవాలన్న బోర్డు తీర్మానాన్ని తాము అంగీకరించామని… ప్రతిపాదనలు అందిన వెంటనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. మొత్తానికి కేంద్రం గెజిట్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుండటంతో సందిగ్ధం నెలకొంది. ఏపీ సానుకూలంగా ఉండటంతో… తెలంగాణ మాత్రం స్పష్టమైన వైఖరి చెప్పలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం గెజిట్‌ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది.

Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *